పిడుగుపడి కర్నూలు జిల్లా ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మృతి చెందారు. కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి విధుల్లో భాగంగా పెద్ద హరివణం గ్రామానికి బయలు దేరారు. రాత్రి 9.30 గంటలకు భారీ వర్షం రావడంతో చిన్న హరివణం బస్టాప్ వద్ద ఆగారు.
కొద్దిసేపటికే తర్వాత అపస్మారకలో ఉన్న ఆయనను కొందరు చూసి.. ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు పిడుగుపడి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: