విలువిద్యలో రాణించాలంటే కఠోర సాధన... ఎంతో ఏకాగ్రత ఉండాలి. ఇలా ఎంతో కష్టసాధ్యమైన విలువిద్యలో కర్నూలుకు చెందిన విష్ణువర్ధన్, వాణిల కుమార్తె హన్విక శ్రీ.. ప్రతిభ కనబరుస్తోంది. ప్రస్తుతం ఎల్కేజీ చదువుతున్న ఈ చిన్నారి సుమారు రెండేళ్ల క్రితమే గాంఢీవం చేతపట్టి ఔరా అనిపిస్తోంది. అండర్- 9 విభాగంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించింది. జాతీయస్థాయిలో 30వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకుంటోంది. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు, ప్రశంసా పత్రాలు పొంది అబ్బురపరుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ చిన్నారి ప్రతిభ చూసి మురిసిపోయారంటే అతిశయోక్తి కాదు. కర్నూలు నగరంలో ప్రైవేటు వ్యక్తులు ఆర్చరీలో శిక్షణ ఇస్తున్నారు. మంచి కోచింగ్ కావాలంటే హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాలకు వెళ్లాలి. ప్రభుత్వం శ్రద్ధ చూపి నగరంలోనే కోచ్‌లను నియమించాలని హన్విక శ్రీ తల్లిదండ్రులు కోరుతున్నారు.
అయిదేళ్లయినా నిండలేదు.. ఆర్చరీలో ఆరితేరింది - medals
ఓనమాలు దిద్దాల్సిన ఆ చిన్నారి చేతులు... గాంఢీవం పట్టాయి. బుడిబుడి అడుగులు వేస్తూ... తల్లి చాటున పెరగాల్సిన ఆ పాప... పతకాల వేటలో పరుగులు తీస్తోంది. అతి పిన్నవయసులోనే... విల్లు ఎక్కుపెడుతూ... అద్భుత ప్రతిభ కనబరుస్తోంది కర్నూలు జిల్లాకు చెందిన ఓ చిన్నారి.
విలువిద్యలో రాణించాలంటే కఠోర సాధన... ఎంతో ఏకాగ్రత ఉండాలి. ఇలా ఎంతో కష్టసాధ్యమైన విలువిద్యలో కర్నూలుకు చెందిన విష్ణువర్ధన్, వాణిల కుమార్తె హన్విక శ్రీ.. ప్రతిభ కనబరుస్తోంది. ప్రస్తుతం ఎల్కేజీ చదువుతున్న ఈ చిన్నారి సుమారు రెండేళ్ల క్రితమే గాంఢీవం చేతపట్టి ఔరా అనిపిస్తోంది. అండర్- 9 విభాగంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించింది. జాతీయస్థాయిలో 30వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకుంటోంది. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు, ప్రశంసా పత్రాలు పొంది అబ్బురపరుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ చిన్నారి ప్రతిభ చూసి మురిసిపోయారంటే అతిశయోక్తి కాదు. కర్నూలు నగరంలో ప్రైవేటు వ్యక్తులు ఆర్చరీలో శిక్షణ ఇస్తున్నారు. మంచి కోచింగ్ కావాలంటే హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాలకు వెళ్లాలి. ప్రభుత్వం శ్రద్ధ చూపి నగరంలోనే కోచ్‌లను నియమించాలని హన్విక శ్రీ తల్లిదండ్రులు కోరుతున్నారు.
కడప జిల్లా రాజంపేట పురపాలక ఓటర్ల జాబితాను కమిషనర్ శ్రీ హరి బాబు ఉ శుక్రవారం చేశారు రైల్వే పట్టణంలోని 20 వార్డులకు సంబంధించి ఫోటోలతో కూడిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విడుదల చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పట్టణంలో ఇరవై వార్డులు ఉండగా 31,668 ఓట్లు ఉన్నట్లు చెప్పారు. ఇందులో పురుషుల ఓట్లు 15382 ఉండగా, స్త్రీలు 16278 ఓటు ఉన్నట్లు ఆయన తెలిపారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ ఓటరు జాబితా కి సంబంధించి సమాచారాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయం, తాసిల్దార్, మండల పరిషత్, సబ్ రిజిస్టర్ మంది కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రధాన పార్టీల నాయకులు కూడా ఉచితంగా ఓటరు జాబితాను అందజేశామన్నారు. ప్రజలు ఎవరైనా జాబితాను పరిశీలించుకుని ఏవైనా అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.
Body:పురపాలక ఓటర్ జాబితా విడుదల
Conclusion:కడప జిల్లా రాజంపేట