కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చరణ్(15) అనే బాలుడు మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని మలుపు వద్ద ఢీకొట్టిన ఆటో.. అనంతరం బోల్తాపడింది. ఆటోలో ప్రయాణికులతో పాటు.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చరణ్ మరణించాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాలుడి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పరామర్శించారు.
ఇదీ చదవండి :