కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీ కొని బేతంచెర్లకు చెందిన చెన్నయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. నంద్యాల నుంచి ద్విచక్ర వాహనంపై బేతంచెర్లకు వెళ్తూ.. తమ్మరాజుపల్లె వద్ద రహదారి దాటుతుండగా కర్నూలు నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీ కొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు..స్థానిక ఎస్‌ఐ రాకేష్ ఘటనాస్థలిని పరిశీలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.