కర్నూలు జిల్లా ఆదోనిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన బాధిత కుంటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు పట్టణంలోని భీమస్ కూడలివద్ద శవంతో ధర్నా నిర్వహించారు. దింతో రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు బాధిత కుంటుంబానికి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. వారి జోక్యంతో బంధువులు ఆందోళన విరమించారు.
ఇదీచదవండి