కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఆడుకుంటున్న రెండేళ్ల పాపపై బొలెరా వాహనం ఎక్కింది. పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన మజ్జిగ చిన్న నరసింహులు, నరసమ్మ దంపతుల కూతురు శైలజ. మంగళవారం ఉదయం శైలజ వారి ఇంటి ముందు ఆడుకుంటుది. అదే సమయంలో నీటిని విక్రయించేందుకు బొలెరా వాహనం వచ్చింది. ఆడుకుంటున్న పాపను గమనించకుండా వాహనాన్ని ముందుకు కదిలించటంతో ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి...