కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి నాయకులు కర్నూలులో ధర్నా నిర్వహించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సలాం కేసులో నిందితులైన పోలీసు అధికారుల ఆస్తులపై విచారణ జరిపించాలని నేతలు నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ.. కలెక్టర్ వీర పాండియన్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.
ఇదీ చదవండి: