కర్నూలు నగరంలోని సంతోష్ నగర్లో రోడ్డుకు కారు అడ్డంగా ఉందన్న పాపానికి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు అడ్డుగా ఉందని హారన్ కొట్టాడు. గమనించిన వాహన యజమానులు మహేశ్వర రెడ్డితో ఘర్షణకు దిగారు.
తిరుగు ప్రయాణంలో..
ఈ క్రమంలో మహేశ్వర రెడ్డి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో కాపు కాసి దారుణంగా చంపేశారు. మృతుడు తెలంగాణలోని మానవపాడుకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు.