కర్నూలు జిల్లా రుద్రవరం సమీపంలో భారీ కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. నల్లమల అటవీ ప్రాంతం దిగువ భాగంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ముళ్లపొదల్లో కొండచిలువను గమనించారు. పెద్ద పాము కావటంతో తమకు ప్రాణహాని ఉంటుందనే భయంతో దాన్ని హతమార్చారు. ఆ కొండచిలువ ఏడు అడుగుల పొడవుంది.
ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో మూడేళ్ల బాలుడు మృతి