కర్నూలు జిల్లా ఆదోని సమీపంలో ప్రైవేట్ పాఠశాల బస్సు అదుపు తప్పింది. ఆదోని మండలం నెట్టేకల్ క్రాస్ దగ్గర ఉదయం పాఠశాలకు వెళ్తున్న బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలంతా సురక్షితంగా బయట పడటంతో తల్లిదండ్రలు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో పరిమితికి మించి చిన్న పిల్లలను ఎక్కించుకొని ఉంటారని.. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీచూడండి.జాతీయ రహదారిపై చెలరేగిన మంటలు.. కారణం?