రాతి గుండు ఎత్తి.. పట్టుతప్పిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా గొలుగొండ గ్రామంలో జరిగింది. సాహెబ్ అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. దసరాకి ముందు గ్రామంలో జరిగే ఉత్సవాల్లో రాతి గుండు పోటీలు నిర్వహిస్తుంటారు.
వాటికి ఇప్పటి నుంచే గ్రామస్తులు సాధన చేయడం మొదలు పెట్టారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం రాతి గుండు ఎత్తి వెళ్తున్న సమయంలో వేళ్లు పట్టు తప్పి.. ఆ గుండు పూర్తిగా సాహెబ్ పై పడింది. తీవ్ర గాయాలపాలైన సాహెబ్.. అక్కడిక్కడే మృతి చెందాడు.
ఇదీ చదవండి: