ETV Bharat / state

యూరిన్ ఇన్​ఫెక్షన్ : కరోనాను జయించాడు.. బ్లాక్ ఫంగస్​తో మరణించాడు

author img

By

Published : May 23, 2021, 10:45 PM IST

బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం నాగలాపురం పరిధిలో జరిగింది. మూత్ర నాళల ఇన్​ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో తుదిశ్వాస విడిచాడు

యూరిన్ ఇన్​ఫెక్షన్ : కరోనాను జయించాడు.. బ్లాక్ ఫంగస్​తో మరణించాడు
యూరిన్ ఇన్​ఫెక్షన్ : కరోనాను జయించాడు.. బ్లాక్ ఫంగస్​తో మరణించాడు

బ్లాక్ ఫంగస్ లక్షణాలతో కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సి.నాగలాపురం గ్రామానికి చెందిన కె. వర ప్రసాద్ అనే వ్యక్తి వ్యాధి సోకి మృతి చెందాడు.

మూత్ర నాళల ఇన్​ఫెక్షన్ రావడంతో..

కొవిడ్ లక్షణాలతో వరప్రసాద్ గత కొన్ని రోజుల క్రితం నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత బాధితుడికి మూత్ర నాళల ఇన్​ఫెక్షన్ రావడంతో మరో ఆస్పత్రిలో చేరగా వైద్యులు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు దేహాన్ని స్వగ్రామానికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి : తహశీల్దార్​ నాగిని డ్యాన్స్​.. లాక్​డౌన్​ నిబంధనలు బేఖాతర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.