కర్నూలు జిల్లా ఆదోనిలో 75వ విశ్వశాంతి యాగ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. 14 రోజుల పాటు జరిగే ఈ వేడుక కోసం 108 హోమ గుండాలు ఏర్పాటు చేశారు. స్వామిజీ కృష్ణ జ్యోతి స్వరూపానంద ఆధ్వర్యంలో రుత్విక్కులు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. యాగక్రతువులో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహా యాగానికి వచ్చే భక్తులు కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
ఇదీ చూడండి: