కర్నూలు జిల్లా బేతంచర్ల మండల ఆర్. కొత్తపల్లి గ్రామంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పిడుగు పడింది. ఈ ఘటనలో 55 మేకలు మృతి చెందాయి. సుమారు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని మేకల యజమాని లక్ష్మయ్య తెలిపారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.
ఇది చదవండి ఆదోనిలో భారీ వర్షం.. రోడ్లు జలమయం