కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం మైనార్టీల రక్షణకు అండగా నిలుస్తానని సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో కలిసి చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. ఇమాం, మౌజంలకు ఇస్తున్న గౌరవ వేతనం రెండింతలు చేస్తామన్న సీఎం..పెళ్లికానుక కింద భవిష్యత్తులో అందరికి లక్ష రూపాయలు ఇస్తానని ఆళ్లగడ్డ సాక్షిగా హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు. జగన్ వస్తే యువతకు ఉద్యోగాలు రావన్న బాబు.. జగన్‌ను చూస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారని వ్యాఖ్యానించారు. మైనార్టీలకు రక్షణ ఉండాలంటే మోదీ ఇంటికెళ్లాలన్నసీఎం... మోదీని ఎదుర్కొన్న సింహం.. ఫరూక్ అబ్దుల్లా అని అభివర్ణించారు.
సంపద సృష్టించి.. పేదప్రజలను ఆదుకుంటానని మాట ఇచ్చిన సీఎం..జగన్ కేసుల వల్ల మోదీ, కేసీఆర్కు ఊడిగం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేసిన బాబు... ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల సహా పలు నగరాల్ని హైదరాబాద్కు దీటుగా తీర్చిదిద్దుతానన్నారు.ఇవి కూడా చదవండి:
కర్నూలులో ప్రధాన పార్టీల ప్రచారాల హోరు