చదువు కోవడానికే కలిశారు. చదువు కోసమే దూరమయ్యారు. ఎవరి ప్రయాణంలో వారు బిజీ అయిపోయారు. సుధీర్ఘకాలం తర్వాత మళ్లీ కలుసుకున్నారు. విద్యార్థి దశలో చేసిన చిలిపి పనులు నెమరు వేసుకున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేస మండలం పెరవని పాఠశాలలో 1995వ సంవత్సరం పదో తరగతి విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. అప్పడు జరిగిన సంఘటనలు గుర్తుచేసుకొన్నారు. తమను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను సత్కరించి వారి గురు భక్తిని చాటుకున్నారు. అనంతరం తామ చదువుకున్న ఊరిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలోనే సరదాగా గడిపారు. అనంతరం ఒకరి దగ్గరి నుంచి ఒకరు వీడ్కోలు తీసకొని ఎవరింటికి వారు పయనమయ్యారు.
ఇదీ చదవండి: విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు