శ్రీశైలం జలాశయానికి వరద వచ్చి చేరుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 2,98,678 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. ఈ క్రమంలో జలాశయం పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి.... 3,77,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో శ్రీశైలం జలాశయం నీటి మట్టం 884.60 అడుగులు... నీటినిల్వ 213.4011 టీఎంసీలుగా నమోదయింది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,102 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు...వంద ఎకరాల్లో పంట నష్టం