ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా.. జంతు ప్రదర్శన శాలలు, పార్కులు, టూరిజం సెంటర్ల మూసివేత! - vijayawada news

కరోనా ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని సందర్శకులు, జంతువుల రక్షణ రీత్యా పర్యాటక ప్రదేశాలు, జూ పార్కులను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. వీటిని రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు పీసీసీఎఫ్ అధికారి ప్రతీప్‌కుమార్ తెలిపారు.

parks temporary closure in the state along with zoo's
రాష్ట్ర వ్యాప్తంగా జూలు, పార్కులు, టూరిజం సెంటర్ల మూసివేత
author img

By

Published : May 4, 2021, 4:34 PM IST

Updated : May 4, 2021, 7:09 PM IST

తిరుపతి జూ పార్క్ వివరాలు తెలుపుతున్న అధికారిణి...

రాష్ట్ర వ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలు మూసివేయాలన్న కేంద్ర అటవీశాఖ ఆదేశాలను అమలు చేయనున్నట్లు పీసీసీఎఫ్ అధికారి ప్రతీప్‌కుమార్ తెలిపారు. సందర్శకులు, జంతువుల రక్షణ దృష్ట్యా.. జూలు, పార్కులు మూసివేతకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జంతువుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని కన్జర్వేటర్లు, డీఎఫ్‌వోలకు ఆదేసించారు.

కరోనా దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖ, తిరుపతి జూ పార్కులను అధికారులు మూసివేయనున్నారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 23 నగర వనాలు, 29 ఎకో టూరిజం సెంటర్లు, 7 టెంపుల్ ఎకో పార్కులను సైతం తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని పీసీసీఎఫ్ తెలిపారు.

చిత్తూరు జిల్లాలో..

రాష్ట్ర అటవీ శాఖ ఆదేశాల మేరకు కరోనా కారణంగా.. తిరుపతి ఎస్వీ జూపార్కును, యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన వాటర్ ఫాల్స్​ను మూసి వేసిస్తున్నట్లు జూపార్కు క్యురేటర్ హిమశైలజ పేర్కొన్నారు. పర్యాటకులు, జంతువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

ఇవీ చదవండి:

టీకాపై సందేహాలా? ఇవిగో సమాధానాలు...

నర్సింగ్‌ స్టాఫ్‌ కొరత...ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు

Last Updated : May 4, 2021, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.