కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామంలో తెదేపా వర్గీయుల ఇళ్లపై వైకాపా కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో గాయపడిన వారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికలకు ముందు నుంచి గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయని గ్రామస్థులు తెలిపారు. పంచాయతీ ఎన్నికల సమయంలో నామినేషన్ వేసి వస్తున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని.. ఆ తర్వాత ఇళ్లపై దాడి చేశారని చెప్పారు.
ఎన్నికల్లో పంచాయతీ సర్పంచిగా తెదేపా బలపరిచిన బోలా తులసమ్మ గెలుపొందగా.. అప్పటినుంచి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని అన్నారు. వాళ్ల పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదని వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: