ETV Bharat / state

వైఎస్ఆర్​టీపీ ప్రజా ప్రస్థానం పాదయాత్రకు మళ్లీ బ్రేక్.. బీఆర్ఎస్​పై మండపడ్డ షర్మిల - YSR Telangana Party President

YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. మహబూబాబాద్ నియోజకవర్గంలో.. ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో శాంతి భద్రతల సమస్య కారణంగా పోలీసులు ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. ఈ సందర్భంగా లోటస్ పాండ్​లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. బీఆర్ఎస్ పార్టీపై విరుచుకు పడ్డారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల
author img

By

Published : Feb 19, 2023, 9:13 PM IST

YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. గతేడాది నవంబర్​లో వరంగల్ జిల్లా చెన్నరావు పేట మండలం శంకరం తండా వద్ద శాంతి భద్రతల సమస్య కారణంగా పోలీసులు ఆమెను అరెస్టు చేయడం విదితమే. అప్పట్లో ఈ అంశంపై ఆమె కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ లోటస్ పాండ్​లోని తన నివాసంలో దీక్ష కూడా చేశారు. ఇదిలా ఉండగా కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పాదయాత్రకు అనుమతించగా.. మహబూబాబాద్​లో కొనసాగుతోంది.

మహబూబాబాద్​లో తన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేపట్టిన పాదయాత్ర మహబూబాబాద్ నియోజకవర్గంలో 3,500కి.మీ. పూర్తి చేసుకుంది. మహబూబాబాద్ పట్టణంలో మళ్లీ అదేవిధంగా బెదిరించడం లాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించారన్నారు. తన ఎస్కార్ట్ వాహనం, అంబులెన్స్​పై బీఆర్​ఎస్ నేతలు దాడి చేశారని మండిపడ్డారు. లోటస్ పాండ్​లో జరిగిన విలేకరుల సమావేశంలో వై.ఎస్.షర్మిల మాట్లాడారు. తనపై జరిగిన దాడి అంశంపై గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ ఆగడాలంటూ.. అతడికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ 2,100 ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. ఆయన చేసేదే మాఫియా, కబ్జాలు.. ఆఖరికి జర్నలిస్టులను కూడా మోసం చేశారని మండిపడ్డారు. శంకర్ నాయక్‌ అసభ్యపదజాలం వాడడం వల్లే తాను స్పందించాల్సి వచ్చిందని షర్మిల స్పష్టం చేశారు. పాలక పక్ష నేతలే దూషిస్తున్నారని దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదని.. మహిళలందరూ ఏకమై కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.

వైఎస్ షర్మిల

బీఆర్ఎస్ గూండాలు నా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. గతంలో మాదిరిగానే మా వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. ఎస్కార్ట్ వాహనంతో పాటు అంబులెన్స్​ను కూడా ధ్వంసం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, అతడి అనుచరులు శాంతిభద్రతల సమస్యలు సృష్టించి.. ఆ నెపం నాపై వేశారు. పోలీసులు నన్ను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. - వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.