విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో 'కంటివెలుగు పథకం' తీరుతెన్నులపై రాష్ట్రస్థాయి కార్యశాలను ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని హాజరయ్యారు. వచ్చే నెల 10నుంచి పథకాన్ని అమలుచేయనున్నట్టు తెలిపారు. 560 కోట్లతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు నిబద్ధతతో పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆరు దశల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా మొదటి రెండు విడతల్లో పాఠశాల విద్యార్థులకు, తర్వాత నాలుగు దశల్లో అందరికీ విస్తరించనున్నట్టు మంత్రి వివరించారు.
ఇది కూడా చదవండి.