Young woman kidnapped in adibatla: రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని సినీ ఫక్కీలో ఇంట్లో అపహరణకు గురైన వైద్యురాలి కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఆమె క్షేమంగా ఉన్నట్లు తన తండ్రికి ఫోన్ చేసి తెలిపింది. సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా యువతి నల్గొండలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై రాచకొండ పోలీసులు.. ఆ లొకేషన్‌కు సంబంధించిన నల్గొండ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆ ఫోన్ లొకేషన్‌ను క్యాచ్ చేసిన నల్గొండ పోలీసులు.. వైద్యురాలిని గుర్తించి.. పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఉదయం ఆదిభట్ల పరిధి మన్నెగూడలో దంతవైద్యురాలు అపహరణకు గురైయ్యింది. దాదాపు 100 వచ్చి ఆ వైద్యురాలి ఇంటిపై దాడికి పాల్పడి.. కిడ్నాపర్లు ఆమెను ఎత్తుకుపోయారని ఆరోపించారు. అడ్డం వచ్చిన ఆమె తండ్రిపై సైతం దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ ఫక్కీలో దౌర్జన్యం చోటు చేసుకుంది. మన్నెగూడలో దంత వైద్యురాలి ఇంటిపై వందమందికిపైగా దుండగులు దాడి చేసి అడ్డొచ్చిన తల్లిదండ్రులను... కర్రలతో కొట్టి.. అపహరించుకుపోయారు. దంతవైద్యురాలి ఇంట్లో సీసీ కెమెరాలు, సామగ్రి, కార్లను దుండగులు ధ్వంసం చేశారు.
డీసీఎం, కార్లలో నవీన్‌రెడ్డి తీసుకువచ్చి దాడి చేయించాడని.. యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పీఎస్‌లో.. ఫిర్యాదు చేసినా పోలీసులు అడ్డుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అపహరణ ఘటన సమాచారం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్.. ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ.. యువతి బంధువులు... సాగర్ రింగ్ వద్ద ఆందోళన చేపట్టారు. కిడ్నాపర్లను గుర్తించి.. వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :