ETV Bharat / state

పెద్దలు ఒప్పుకోరని... యువకుడి బలవన్మరణం

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పకోరని వారికి తెలియకుండా ఆర్యసమాజ్​లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ఉద్యోగం వచ్చాక విషయాన్ని తల్లిదండ్రులకు చెబుదామనుకున్నారు. కాలగమనంలో నాలుగేళ్లు గడిచాయి. రెండు నెలల క్రితం వివాహం గురించి అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి భార్యాభర్తలు కలవకుండా దూరంగా ఉంచారు. మనస్థాపం చెందిన ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడాడ్డు.

కులాంతర విహహం శాపమై...యువకుడి బలవనర్మణం
author img

By

Published : Jul 17, 2019, 12:14 AM IST

కృష్ణా జిల్లా పెద్దవరం గ్రామానికి చెందిన యడవల్లి ప్రసన్నకూమార్ తన చిన్ననాటి స్నేహితురాలని ప్రేమించాడు. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావటంతో వారి పెళ్లికి ఒప్పుకోరని ఆర్యసమాజ్​లో 2015లో విహహం చేసుకున్నారు. ఇరువురికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత విషయం పెద్దలకు చెబితే ఒప్పుకుంటారని భావించారు. అప్పటివరకు తన భార్యను చదువుకోమని చెప్పి ప్రసన్నకూమార్ షిర్డీలో ఉద్యోగం చేయటానికి వెళ్లాడు. కాలగమనంలో నాలుగేళ్లు గడచిపోయాయి. రెండు నెలల క్రితం వీరి రహస్య వివాహం ఇరువురి పెద్దలకు తెలిసింది. అప్పటి నుంచి భార్యభర్తల్ని ఇద్దర్నీ కలవనీయకుండా అమ్మాయి తల్లిదండ్రులు దూరం పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసన్నకుమార్ అర్థరాత్రి పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడాడ్డు.

యువకుడి ఆత్మహత్య

ఇదీ చదవండి... చదవలేనని తెలిసి... తనువు చాలించింది!

Intro:Ap_vsp_49_16_marcket_lo_praja_swamyam_chitra_abinandana_sabha_AP10077_k.Bhanojirao_anakapalli
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఇది ప్రమాదంలో పడిందని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి లోని మార్కెట్లో ప్రజాస్వామ్యం చిత్రం ప్రదర్శింపబడుతున్న షిరిడి సాయి థియేటర్ లో అభినందన సభ కార్యక్రమం జరిగింది లీడర్ పీపుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ వి వి రమణ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి , వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విచ్చేసారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ దాన్ని ఇప్పటి వరకు 30 చిత్రాలు తీశానన్నారు 20 చిత్రాలు వరకూ ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. గత కొన్నేళ్లుగా తాను తీసిన చిత్రాలు నిరాశ మిగిల్చాయని పేర్కొన్నారు. మార్కెట్లో ప్రజాస్వామ్యం చిత్రం తనకు పూర్వ వైభవం తెచ్చిందన్నారు. మా దేశంలో ప్రజాస్వామ్యం చాల ప్రమాదంలో ఉందని వారసత్వ రాజకీయాలు పార్టీ నాయకులతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని పేర్కొన్నారు ప్రమాదం లో పడ్డ ప్రజాస్వామ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపేందుకే మార్కెట్లో ప్రజాస్వామ్యం చిత్రాన్ని తెరకెక్కించినట్లు పేర్కొన్నారు

Body:ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సామాజిక స్ఫూర్తితో ఆర్.నారాయణమూర్తి చిత్రాలు తీస్తారని తెలిపారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తీసే ఇలాంటి చిత్రాలను ఆదరించాలని సూచించారు.

Conclusion:కార్యక్రమంలో అనకాపల్లి తహసిల్దార్ ప్రసాదరావు పాల్గొన్నారు.అనకాపల్లి వచ్చిన ఆర్ నారాయణ మూర్తి ని పలువురు సత్కరించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.