ETV Bharat / state

మీ ప్రయత్నాలెవరి కోసం....ప్రజల కోసమా...లేకా..!?

author img

By

Published : Aug 1, 2019, 12:23 PM IST

నిమ్మగడ్డ ప్రసాద్​ను విడిపించాలని వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనీ యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. . ఎంపీలుగా ఎన్నికైంది 'నిందితుల ప్రయోజనాల కోసమా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమా...' అని ఆయన నిలదీశారు.

నిమ్మగడ్డ ప్రసాద్​ను విడిపించాలని వైకాపా నేతల ప్రయత్మాలు..యనమల రామకృష్ణుడు

జగన్ ఆదేశాలతోనే వైకాపా ఎంపీలు నిమ్మగడ్డను విడిపించాలని ప్రయత్నంలో భాగంగా వినతి పత్రాలు సమర్పించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్​పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీలుగా ఎన్నికైంది 'నిందితుల ప్రయోజనాల కోసమా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమా...' అని ఆయన నిలదీశారు. జగన్‌పై దాఖలైన 14ఛార్జిషీట్లలో ఇది 4వ ఛార్జిషీట్ అని గుర్తుచేశారు. ఏ1 జగన్ మోహన్ రెడ్డి, ఏ2 విజయ సాయిరెడ్డి అయితే ఏ3గా నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ మోహన్ రెడ్డి దోపిడికి వాన్ పిక్ కుంభకోణం ఒక ఉదాహరణ మాత్రమేననీ..ఆ కుంభకోణంలోని అసలు వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్, సీఎంకు ఎంత సన్నిహితుడో తెలియడానికి, అరెస్ట్ అయిన 24గంటల్లోపే వైకాపా ఎంపిల ప్రతినిధి బృందం కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్​ను కలవడమే సాక్ష్యమని వెల్లడించారు. అంతర్జాతీయంగా అవినీతి కేసుల్లో సీఎం పేరు మార్మోగుతోందని...సీఎంగా విధుల నిర్వహణకు శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా, వాయిదాలకు మినహాయింపు పొందే ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్​రెడ్డేనని ఎద్దేవా చేశారు. చివరికి విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి పొందే ముఖ్యమంత్రి ఈయన ఒక్కరేనని రామకృష్ణుడు దుయ్యబట్టారు.

ఇదీ చూడండీ:నిజం ఒప్పుకున్నందుకు జగన్​కు కృతజ్ఞతలు: లోకేశ్

Intro:FILENAME:AP_ONG_32_31_TRIPURANTAKA_KSHETRAM_HUNDI_LEKKIMPU_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

ప్రకాశం జిల్లా లోనే ప్రసిద్ధి గాంచిన త్రిపురంతకం లోని త్రిపురాంతక క్షేత్రం లో ని ఆలయల హుండీ ని లెక్కించారు. లెక్కింపు కార్యక్రమం ఆలయాల ఈవో, అర్చకుల మధ్య జరిగింది. గత 142 రోజులకు గాను రూ. 13,27,589 హుండీ ఆదాయం వచ్చింది. బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి హుండీ ఆదాయం రూ.889219, త్రిపురంతకేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.389902, అన్నదాన హుండీ ఆదాయం రూ.48468 వచ్చింది.Body:Kit mom 749Conclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.