ETV Bharat / state

MLA Parthasarathi: బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా..? - ఏపీ వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మండిపడ్డారు. బీసీల కోసం తెదేపా హయాంలో తీసుకువచ్చిన ఏ పథకమూ అమలుకు నోచుకోలేదని దుయ్యబట్టారు. బలహీనవర్గాలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలపై తెదేపా నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

mla parthasarathi
ycp mla parthasarathi fiers on chandrababu
author img

By

Published : Aug 20, 2021, 5:28 PM IST

బీసీల కోసం 36 పథకాలు తీసుకొస్తే వాటిని జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్న తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థ సారధి సవాల్ చేశారు. ముందుగా బీసీల కోసం తీసుకొచ్చిన 36 పథకాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో బీసీల కోసం తలపెట్టిన ఏ పథకమూ అమలుకు నోచుకోలేదన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వంలో బలహీన వర్గాలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలపై తెదేపా నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైకాపా పాలనలో 139 బీసీ కులాలకు గాను 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లను నియమించారని పార్థసారధి గుర్తు చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఎన్ని బీసీ కులాలున్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. 50 వేల కోట్లను నేరుగా బీసీల బ్యాంకు ఖాతాలకు జమ చేశామని, 19వేల కోట్లు ఇతర రూపాల్లో ఆర్థిక సాయం అందించామని చెప్పారు. చంద్రబాబు మాటలు వినేందుకు బీసీలు ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఏమన్నారంటే..

జగన్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిన ప్రతి బీసీకి అండగా నిలుస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. శుక్రవారం పార్టీ బీసీ నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన... బీసీల కోసం గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో సగం కూడా అమలు చేయటం లేదన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ.., రాజకీయంగా అణచివేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. బీసీలకు రాజకీయ సామాజిక అభివృద్ధికి పునాది వేసిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దాదాపు 35కు పైగా పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. బీసీలకు రాజకీయాల్లో అవకాశాలు మెరుగు పర్చడమే లక్ష్యంగా నాడు రిజర్వేషన్లను ప్రోత్సహించామని...జగన్ ప్రభుత్వం మాత్రం బీసీలకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. రెండేళ్లుగా బీసీలను మభ్యబెట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కార్పొరేషన్ల నిధులు ఖర్చు చేయకుండా నిర్వీర్యం చేశారన్నారని ఆరోపించారు. బీసీలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్శిటీ వీసీల్లో, సెర్చ్ కమిటీల్లో, సలహాదారుల్లో, టీటీడీ బోర్డులో, విద్యుత్ సంస్కరణ బోర్డుల్లో ఎక్కడా బీసీల ప్రాధాన్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు. ప్రాధాన్యత కలిగిన పదవులన్నింటిని సొంత సామాజికవర్గానికి కేటాయించి..అప్రధాన్యమైన పదవులు, కార్పొరేషన్ పదవులు బీసీలకు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. బీసీ కార్పొరేషన్ల పేరుతో హడావుడి తప్ప బీసీలకు చేసిందేమీ లేదన్నారు. 2 వేల కంటే తక్కువ జనాభా కలిగిన 81 కులాలకు కార్పొరేషన్లు లేకుండా చేశారన్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.