కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆత్మనున్యతా భావంతో ఉండొద్దని వైకాపా రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు దుట్టా రామచంద్రరావు హితవు పలికారు. పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేసి వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చిన అండగా ఉంటామన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తులు..సీనియర్ నేతలతో కలిసి నడవాలని హితవుపలికారు. అలాకాదని పెత్తనం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు.
యార్లగడ్డ వెంకట్రావు, తనకు విభేదాలు ఉన్న మాట వాస్తమే అని రామచంద్రరావు అన్నారు. సొసైటీ బ్యాంకు అధ్యక్షుల పదవులు అగ్రవర్ణాల వారికే కట్టబెట్టారని, ఎస్సీ, ఎస్టీ , బీసీలకు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయంలో మినహా మిగతా ఏ విషయాల్లో యార్లగడ్డతో గొడవలు లేవన్నారు. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు వస్తాయని ఎవరు అధైర్యపడవద్దన్నారు.
ఇదీ చదవండి : కరోనా యోధురాలు... 86 ఏళ్ల వయసులో వైరస్‌పై విజయం