YSRCP Leaders Attack on TDP Activists : అధికార వైసీపీ కార్యకర్తల ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. అన్యాయమని ఎదురు తిరిగిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్నడు లేని విధంగా కార్యకర్తలు ప్రతిపక్ష కార్యకర్తలతో హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం.. టీడీపీ కార్తకర్తలపై దాడికి దారి తీసింది. ఈ దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా మారటంతో విజయవాడకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖబరస్తాన్ స్థల పరిశీలనలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదమే టీడీపీ కార్యకర్తలపై దాడికి కారణమయ్యింది.
నగరంలోని పలు మసీదులకు రాడార్ కేంద్రం సమీపంలో 2 ఎకరాల భూమిని కబరస్తాన్ నిమిత్తం కేటాయించారు. ఈ స్థలాన్ని పరిశీలించేందుకు ఇంగ్లీష్ పాలెం మసీద్ కమిటీ ప్రతినిధులు వెళ్లారు. వారు వైసీపీ మద్దతుదారులు కాగా వారికి.. వైసీపీలోని మరో వర్గానికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్య మాట మాట పెరిగి తోపులాటకు దారి తీసింది. ఈ తోపులాటపై కోపోద్రిక్తులైన ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వివాదంలో వైసీపీ రెండు వర్గాలలోని ఓ వర్గానికి టీడీపీ కార్యకర్తలు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి : అనంతలో ఆగని వైసీపీ అరాచకాలు.. జేసీ అనుచరుడిపై హత్యాయత్నం
మద్దతు తెలిపిన టీడీపీ కార్యకర్తలైన సయ్యద్ బాజీ, చోటా, బాబులు.. ఓ వైసీపీ వర్గానికి మద్ధతుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దీంతో ఆగ్రహనికి మరో వైసీపీ వర్గం టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగింది. అదివారం అర్థరాత్రి సమయంలో ఇంగ్లీష్ పాలెం వద్ద దారి కాచి మరీ వైసీపీ శ్రేణలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో సయ్యద్ బాజీ, చోటా బాబు, రిజ్వాన్లకు గాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించగా.. వీరిలో బాజీ, చోటా బాబు పరిస్థితి విషమంగా మారింది. దీంతో వారిద్దర్ని విజయవాడలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
"మధ్యాహ్నం ఇంగ్లీష్ పాలెం మసీద్ దగ్గర మసీద్ కమిటీ ప్రెసిడెంట్కు.. వేరే వాళ్లకు గొడవలు జరిగాయి. మా ప్రెసిడెంట్ను పరామర్శించటానికి మేము వెళ్లాము. నన్ను బాజీ అనే వ్యక్తి దారిలో కాపు కాసి కొట్టారు. నేను అక్కడి నుంచి పారిపోయాను." - టీడీపీ కార్యకర్త
ఇవీ చదవండి :