కృష్ణా జిల్లా నందిగామ మండలం ముప్పాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపాడు తిరుణాలకి వెళ్తున్న ఆటో, ద్విచక్రవాహనం ఢీ కొన్న ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో తిరునాళ్లకు అటుగా వెళ్తున్న వైకాపా నాయకుడు మెుండితోక అరుణ్ కుమార్ వెంటనే స్పందించారు. క్షతగాత్రులను దగ్గరుండి తన చేతులతో అంబులెన్స్ లో ఎక్కించారు. అనంతరం వారి వైద్య ఖర్చులకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించారు. తక్షణమే స్పందించి సాయమందించిన అరుణ్‌కుమార్‌ను స్థానికులు అభినందించారు.
ఇదీ చూడండి: