వైకాపా ప్రభుత్వం పదేపదే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అత్యున్నత న్యాయస్థానం చెప్పినా ఈ ప్రభుత్వానికి లెక్కలేదని విమర్శించారు. కోర్టులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనట్లు వ్యవహరిస్తోందన్నది ప్రజలనుకుంటున్నారని చెప్పారు.
పాలనలో విఫలమైన ప్రభుత్వం ప్రతిపక్షాలపై మాత్రం కక్ష సాధింపునకు పాల్పడుతోందని బొండా ఉమ మండిపడ్డారు. కరోనా సామాజిక వ్యాప్తిని అరికట్టేందుకు కనీసం చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. కరోనాపై ప్రజలకు రూపాయి ఖర్చుపెట్టని వైకాపా సర్కారు... లాయర్లకు కోట్లు ఖర్చు పెడుతోందని ధ్వజమెత్తారు. ఇన్నిసార్లు కోర్టులతో మొట్టికాయలు తిన్న మొట్టమొదటి ప్రభుత్వం జగన్‌దేనని బొండా ఉమ విమర్శించారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రం పరువు తీస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి
'సుప్రీంలో జస్టిస్ కనగరాజ్‌తో పిటిషన్ వేయించే ఆలోచనలో ప్రభుత్వం'