విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్‌కు చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు, యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. సెంట్రల్ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత, యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, వైకాపా ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న దాడులు సహించలేకే తెదేపాలో చేరారని బొండా అన్నారు. యువతకు తెదేపా ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి...