కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో తెదేపా కార్యకర్త పానకాల ప్రసాద్‌పై వైకాపా వర్గీయులు దాడిచేశారు. స్వల్పగాయాలైన అతడిని చికిత్స కోసం నందిగామ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తనపై కర్రతో విపరీతంగా దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తెదేపాలో కార్యకర్తగా తిరుగుతానన్న కోపంతోనే.. తనను ఒక్కడిని చేసి గాయపరిచారని ఆరోపించాడు. నడి రోడ్డుపై ట్రాక్టర్ ఆపి.. తన బండిలోని రాడ్డే తీసుకుని దాడి చేశారన్నాడు. స్థానికులు వచ్చి దాడిని ఆపారని.. తన స్నేహితులు ఆసుపత్రికి తీసుకువచ్చారని చెప్పాడు.
ఇది కూడా చదవండి