కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని న్యూబీ కాలనీలో విజయలక్ష్మి అనే వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి(SUSPICIOUS DEATH) చెందింది. వీటీపీఎస్ ఆసుపత్రిలో విజయలక్ష్మి పని చేస్తోంది. భర్త సురేష్ మరో మహిళతో వివాహేతర సంబంధం(EXTRA MARITAL AFFAIR) పెట్టుకున్నాడనే ఆరోపణ ఉండటంతో.. గత కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని బంధువులు చెబుతున్నారు. అందువల్లనే భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భర్త సురేశ్ యత్నిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
TS Govt Letter to KRMB: ఏపీని నిలువరించండి.. కృష్ణాబోర్డుకు తెలంగాణ సర్కార్ మరో లేఖ