ETV Bharat / state

అక్రమ సంబంధం.. ఆవేశంలో అరాచకం! - vjayawada

వివాహేతర సంబంధం.. అభం శుభం తెలియని ఓ దివ్యాంగురాలిని బలితీసుకుంది. విజయవాడ సనత్​నగర్​లో జరిగిన ఈ దారుణం.. నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

అక్రమ సంబంధం.. ఆవేశంలో అరాచకం!
author img

By

Published : Jun 19, 2019, 2:52 PM IST

Updated : Jun 19, 2019, 11:54 PM IST

విజయవాడ సనత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఘటనపై.. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఖలీల్​కు.. ఆయన సోదరుడి భార్య ముంతాజ్​తో వివాహేతర సంబంధం ఉండేది. కొంత కాలంగా ముంతాజ్​కు దూరంగా ఉంటున్న ఖలీల్.. 3 నెలల క్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇది జీర్ణించుకోలేని ముంతాజ్... ఖలీల్​ను, ఆయన భార్యను చంపేందుకు పథకం రచించింది. ఉదయం పెట్రోల్ సీసాతో ఖలీల్ ఇంటికి వెళ్లి ఆయనపై పెట్రోల్ పోసింది. ఆ పక్కనే ఖలీల్ సోదరి నిద్రించి ఉంది. వికలాంగురాలైన ఆమెను సరిగా పోల్చుకోలేని నిందితురాలు.. ఖలీల్ భార్యగా భావించింది. పెట్రోల్ పోసి నిప్పంటించింది. బాధితురాలు అక్కడికక్కడే చనిపోయింది. మరోవైపు.. 80 శాతం గాయాలతో ఆస్పత్రి పాలైన ఖలీల్ మరణించాడు. వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

దీ చదవండి

చెల్లె పెళ్లి చేసుకుంటోందని.. సోదరుడి కిరాతకం!

Intro:AP_GNT_41_19_CAR_ACCIDENT_OKKARU_MRUTHI_AV_C7. FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIST కిట్ నెంబర్ 676 స్నేహితుని వివాహానికి వస్తూ విజయవాడకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మేడ అరవింద్ మృతి చెందిన సంఘటన పలువురిని కలతచెంది ఎలా చేసింది . విజయవాడ నుండి కొందరు, హైదరాబాదు నుండి కొందరు స్నేహితులు కలిసి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలంలోని స్నేహితుని వివాహానికి కారులో వస్తూ ఉండగా నేడు తెల్లవారుజామున అప్పికట్ల వద్ద గేదె అడ్డురావడంతో కారు అదుపు తప్పి గొంతులో పడిపోవడంతో ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు జిల్లా ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Body:బాపట్ల

Conclusion:గుంటూరు జిల్లా
Last Updated : Jun 19, 2019, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.