కృష్ణాజిల్లా గన్నవరంలోని కొత్తపేటలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు మోటమర్రి సంధ్య(25) ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్థానిక దుకాణ యజమాని కోడలు కాగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సంధ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: