కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ కార్యాలయంలో నామ పత్రాల ఉపసంహరణ, అభ్యర్థుల నుంచి బీ ఫారం తీసుకునే ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రారంభించారు. జిల్లాలోని కంచికచర్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచిన అభ్యర్థుల నామ పత్రాలు, ఇతర సామగ్రిని ప్రత్యేక పోలీసు బందోబస్తుతో.. అధికారులు నగర పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు.
తమ పత్రాలు ఎలా ఉన్నాయో చూసుకోవటానికి.. అభ్యర్థులతో పాటు రాజకీయ నాయకులు ఉత్సాహంగా పంచాయతీ కార్యాలయానికి తరలివచ్చారు. మరోవైపు భాజపా, జనసేన పార్టీ అభ్యర్థులు ఆయా పార్టీల బీ ఫారాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. నగర పంచాయతీ కమిషనర్ జయరామ్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇదీ చదవండి:
రిజిస్ట్రేషన్లపై తర్జనభర్జనలు.. ప్రారంభ ప్రక్రియ కసరత్తులో అధికారులు