కృష్ణా జిల్లా ముసునూరు మండలం చక్కపల్లి గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి రూ. 2.50 లక్షల విలువ గల 360 మద్యం సీసాలు, 2 మానిటర్లను దొంగలించారు. షాపు నిర్వాహకుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముసునూరు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ రామచంద్రరావు తెలిపారు. ఘటనా స్థలాన్ని క్లూస్‌టీం పరిశీలించారు.
ఇదీ చదవండి :