ETV Bharat / state

భార్య తల నరికిన నిందితుడికి సహకరించిన వ్యక్తుల అరెస్టు

విజయవాడలో ఈనెల 11న భార్య తలను కత్తితో నరికిన కేసులో పోలీసులు భర్తతో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

హత్య కేసు
author img

By

Published : Aug 17, 2019, 9:48 AM IST

భార్య తలను నరికిన కేసులో మరో వ్యక్తి అరెస్టు

విజయవాడ హత్య కేసులో కాలువలో పారేసిన భార్య తల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. కేసు విచారణలో తల లేకపోయినా ఇబ్బంది లేదని డీఎన్​ఏ పరీక్ష ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని విజయవాడ డీసీపీ సీహెచ్‌. విజయరావు తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. 2015లో విజయవాడలోని ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థలో ఉద్యోగులుగా పనిచేసిన పేటేటి ప్రదీప్‌కుమార్‌, సహచర ఉద్యోగి గొప్పిశెట్టి మణిక్రాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2017 నుంచి ప్రదీప్‌కుమార్‌తో విభేదాలతో అతనిపై మణిక్రాంతి సూర్యారావుపేట, మాచవరం, సత్యనారాయణపురం స్టేషన్‌లలో పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించింది. ఒక కేసులో కోర్టుకు సరిగా హాజరుకానందున నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసి ఈ నెల 6న అరెస్టు చేశారు పోలీసులు. మర్నాడే బెయిల్‌పై బయటకొచ్చి... భార్యతో గొడవకు దిగాడు. అదే రోజు ఆమెను హత్య చేసి దీనికి పరిచయస్తుడైన కారు డ్రైవర్‌ గరికపాటి భవానీప్రసాద్‌ సహకరించాడు.

ఇది కూడా చదవండి.

కృష్ణా నదిలో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులు

Intro:అన్నా క్యాంటీన్లు మూత పై గూడూరు పట్టణం అన్నా క్యాంటీన్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్.
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం లో అన్నా క్యాంటీన్ ఎదుట గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పట్టణ పుర వీధుల్లో ర్యాలీల చేపట్టారు. రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ లను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పెడితే ఇపుడు రద్దు చేయడం వల్ల పేదలు ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నా అంటే ఎన్టీఆర్ అని అన్నారు.దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం రాజశేఖర్ రెడ్డి అనే గుర్తు గా నిలిచి పోతారని ఏదయినా పేరు పెట్టుకుని పేదల ఆకలి తీర్చాలంటూ మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు.
బైట్: పాశిం సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే.గూడూరు.Body:1Conclusion:బైట్ :పాశం సునీల్ కుమార్ (టిడిపి మాజీ ఎమ్మెల్యే)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.