కొవిడ్ లక్షణాలతో కృష్ణాజిల్లా కోడూరు మండలం యర్రారెడ్డివారిపాలెం గ్రామానికి చెందిన దంపతులు ఎలిశెట్టి బసవయ్య (65), రాజేశ్వరి(60) వారం రోజుల వ్యవధిలో మృతి చెందారు. రాజేశ్వరి వారం రోజుల క్రితం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బసవయ్య ఆరోగ్య పరిస్థితి కూడా విషమించగా, చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరు మృతిచెందడంతో యర్రారెడ్డివారిపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా అందుబాటులోకి తీసుకురండి: హైకోర్టు