ETV Bharat / state

'చంద్రబాబు లేఖపై వైకాపా నేతలకు ఉలికిపాటు ఎందుకు?'

కేంద్ర ప్రభుత్వానికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాయడంపై వైకాపా నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రానికి సంబంధం లేదని ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ శాఖలు ఎందుకు ప్రతివాదులుగా ఉన్నాయో జీవీఎల్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

kalva srinivasulu
kalva srinivasulu
author img

By

Published : Aug 20, 2020, 5:37 PM IST

తెదేపా నేతల ఫోన్ సంభాషణల వివరాలు వైకాపాకు చేరుతున్నాయని గ్రహించే ఫోన్ ట్యాంపింగ్​ వ్యవహారంపై ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. చంద్రబాబు లేఖపై వైకాపా నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు గతంలో అనేక లేఖలు రాస్తే, వాటిపై ఏనాడూ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

14 నెలలుగా పోలీస్ శాఖలోని కొందరు అత్యుత్సాహపరులు, రాజకీయ అండదండలున్నవారు మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈఎస్​ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అవినీతి చేశారన్న ఆధారాలు లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ముగ్గురు వైకాపా నేతల కబంధహస్తాల్లో రాజ్యాంగ వ్యవస్థలున్నాయని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రానికి సంబంధం లేకుంటే... కేంద్ర ప్రభుత్వ శాఖలు ఎందుకు ప్రతివాదులుగా ఉన్నాయో ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమాధానం చెప్పాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై కర్ణాటక, రాజస్థాన్ భాజపా నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేయలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయకుంటే... ఫోన్ ట్యాపింగ్​పై విచారణకు ఆదేశించడానికి ఎందుకు వెనకాడుతోందని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై విచారణ 27కు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.