ETV Bharat / state

VARLA RAMAIAH: జగన్​ను విజయమ్మ ఎందుకు మందలించట్లేదు?: వర్ల రామయ్య - వర్ల రామయ్య

వైఎస్ విజయమ్మ, షర్మిలపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న కొడుకు జగన్ రెడ్డిని విజయమ్మ ఎందుకు మందలించట్లేదని ప్రశ్నించారు.

Why Vijayamma did not advise Jagan?
జగన్ కు విజయమ్మ ఎందుకు బుద్ధిచెప్పట్లేదు ?
author img

By

Published : Sep 2, 2021, 3:29 PM IST

రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న కొడుకు జగన్ రెడ్డికి విజయమ్మ ఎందుకు బుద్ధి చెప్పట్లేదని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ ప్రణాళికలో భాగంగా ప్రజల్ని మోసగించేందుకు జగన్ రెడ్డి, విజయమ్మ, షర్మిల ఎవరి పాత్ర వారు పోషించారని విమర్శించారు. జగన్ గెలుపు కోసం ప్రజల్ని మభ్యపెట్టిన విజయమ్మ, షర్మిలలు.. రాష్ట్రం అల్లకల్లోమైతే ఇప్పుడు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానమూ అమలు కావట్లేదని దుయ్యబట్టారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రోజూ ధర్నా చౌక్ రద్దీగా ఉంటోందని ఆక్షేపించారు. తమది కుటుంబ వ్యవస్థ కాదన్నట్లుగా విజయమ్మ, షర్మిల ఉండటం సబబా అని ఆయన నిలదీశారు.

ఇదీ చదవండి: 'మంత్రి సురేష్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.