అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద సీఎం జగన్ పౌష్టికాహారం అందిస్తున్నారని మంత్రి తానేటి వనిత కొనియాడారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది రూ.1800 కోట్లతో గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు వైకాపా ప్రభుత్వం బలవర్ధకమైన ఆహారం అందిస్తోందన్నారు. 77 గిరిజన మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశామన్నారు.
రాష్ట్రంలో అధిక శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని మంత్రి తానేటి వనిత అన్నారు. చిన్నారులకు కూడా సరైన పోషకాహారం అందకపోవడంతో... వయస్సుకు తగ్గ ఎదుగుదల ఉండటం లేదన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 30 లక్షలకుపైగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు లబ్ధి పొందుతారన్నారు.
ఇదీ చదవండి: