కృష్ణాజిల్లా నూజివీడులో హాస్టళ్ల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎస్.కె.షాహిద్ బాబు తనిఖీలు నిర్వహించారు. డివిజన్లోని 9 హాస్టళ్లను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. శ్రీ మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్,డిగ్రీ కళాశాల బాలికల హాస్టళ్లను పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఇక్కడ శాశ్వత వార్డెన్ నియమించినట్లు చెప్పారు. విద్యార్థులకు అందించే మెనూ, కనీస సౌకర్యాల అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఎంప్లాయిస్ కాలనీ జూనియర్ బాలికల హాస్టల్ లోని నీరు, శానిటేషన్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మెరుగైన వసతుల కోసం శాశ్వత ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో నూజివీడు ఎస్ డబ్ల్యు డి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ట్రిపుల్ ఐటీ... సమస్యల్లో మేటీ