కర్ణాటకలో ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఆల్మట్టి, నారాయణ పూర్ లో ఇప్పటికే గరిష్ఠానికి చేరడం వల్ల.. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ జలాశయానికి 1.80 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక్కడి నుంచి జూరాలకు 1.84 లక్షల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. రిజర్వాయర్లో ప్రస్తుత నీటిమట్టం 491.330 మీటర్లు కాగా.. పూర్తి నీటి మట్టం 492.25 మీటర్లు. పూర్తి నీటి నిల్వ 33.313 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 29.194 టీఎంసీలకు చేరింది.
ఇక్కడి నుంచి జూరాల జలాశయానికి నీరు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి వదిలిన నీరు ఇంకా చేరనందున.. జూరాల ఇన్‌ఫ్లో 14,00 క్యూసెక్కులుగా ఉంది. ఎగువన ప్రవాహాన్ని అంచనా వేసిన అధికారులు 29,312 క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. ప్రస్తుతం జూరాల నీటిమట్టం 316.070 మీటర్లకు చేరగా.. పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు. రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ.. 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.859 టీఎంసీలకు చేరింది.
ఇదీ చదవండి: