కృష్ణాజిల్లా మండవల్లి మండలం నాగభూషణపురం గ్రామాన్ని ఆనుకుని ఉన్న 76 ఎకరాల చేపల చెరువుకు గండిపడింది. ఒక్కసారిగా భారీ నీటిప్రవాహం ఊరిని ముంచేసింది. గ్రామంలోని 20 ఇళ్ల వరకూ నీరు వచ్చిచేరింది.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. డిప్యూటీ తహసీల్దారు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది గండిపూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కైకలూరు అగ్నిమాపక సిబ్బంది, మండవల్లి పోలీసులు గ్రామంలోని యువకులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఇదీచూడండి.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ ఆత్మహత్య