ETV Bharat / state

'బహిష్కరణ తప్పదు' - IPC

ఓటు హక్కును అర్హులకు దూరం చేయాలని చూసేవారికి జిల్లా బహిష్కరణ తప్పదని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు. క్రిమినల్ కేసులు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌
author img

By

Published : Mar 4, 2019, 1:46 PM IST

Updated : Mar 4, 2019, 4:06 PM IST

కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌
పవిత్రమైన ఓటు హక్కును...అర్హులు పొందకుండా ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు. అలాంటి వారికి జిల్లా బహిష్కరణ దండన తప్పదన్నారు. మచిలీపట్నంలోని పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన ఆయన... ఫారం-7 దరఖాస్తులపై స్పందించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తే శిక్షలు తప్పవన్నారు. అక్కడక్కడా ఇలాంటి కేసులు వెలుగు చూశాయన్న కలెక్టర్..వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహశీల్దార్‌ను ఆదేశించారు. జగ్గయ్యపేట, మైలవరం, జి.కొండూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిలో చాలా వరకుబోగస్‌ ఫిర్యాదులే అనిప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్టు వివరించారు. విచారణ వేగవతం చేసి బాధ్యులను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఓట్ల విషయంలో అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై ఐపీసీ సెక్షన్‌ 419, 182, 171సి లతోపాటు ఐటీ యాక్ట్‌ 66 డి కింద కేసు నమోదు చేస్తారని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్న అధికారులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తే క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.

ఇవీ చదవండీ

ఓటుపై ఫిర్యాదు

sample description
Last Updated : Mar 4, 2019, 4:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.