రాష్ట్రంలో తెదేపాదే విజయం : బోండా ఉమామహేశ్వర రావు రాష్ట్రానికి కేంద్రంగా భావించే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించామని చెబుతున్నారు ప్రస్తుత తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.2014 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించినబోండా ఉమా...
ఈసారి మళ్లీబరిలో దిగారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో 700కు పైగా కార్యక్రమాలు చేపట్టిన తనను ప్రజలు తప్పక గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు బోండా ఉమామహేశ్వరరావు.విజయవాడ సెంట్రల్ పురోగతి
-
రూ.6.73 కోట్లతో సింగ్నగర్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం
-
ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు
-
దాదాపు రూ.150 కోట్లతో డ్రైనేజీ పనులు
-
రూ.16 కోట్లతో కొత్తగా విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు
-
రూ.22.36కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ
-
మధురానగర్ నుంచి దేవినగర్ వరకు ఫ్లై ఓవర్
ఇవి చదవండి
నాకు ఎవ్వరూ పోటీ కాదు: ఉప్పులేటి కల్పన