ఆస్ట్రేలియాలో చదువు పేరుతో మరో కంపెనీ మోసానికి తెరలేపింది. వీసా పేరుతో ఓ కన్సల్టెన్సీ విద్యార్థిని నుంచి 9 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆరునెలలు గడిచినా వీసా రాకపోవటంతో విసుగు చెందిన బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత విజయవాడ ప్రధాన నగరంగా ఈ దందా కొనసాగుతోంది. విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు స్థానికంగా ఉన్న కన్సల్టెన్సీలను సంప్రదిస్తున్నారు. ఇదే అదునుగా భావించి వారు దోచుకుంటున్నారు.
విజయవాడ పెనమలూరుకు చెందిన ఓ యువతి ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు గ్లోబల్ ట్రీ కన్సల్టెన్సీని సంప్రదించారు. వీసా ప్రాసెసింగ్ ఫీజు కోసం 9 లక్షలు బాధితురాలి నుంచి వసూలు చేశారు. ఆరు నెలలు గడిచినా వీసా రాలేదు. బాధితురాలి తండ్రి పెనమలూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ: WC19: పాక్తో మ్యాచ్- 12 రాత్రులు నిద్రపోని సచిన్