కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఒక్క ఎకరం కొనకుండా ప్రభుత్వ భూములనే ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. నియోజకవర్గ పరిధిలో 14 వేల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో జగ్గయ్యపేట ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. లే అవుట్లు పూర్తి చేసేందుకు కష్టపడి పని చేసిన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అలాగే పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఇవీ చదవండి..