Villagers Demand to Provide Basic Facilities Jagananna Colony: కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడుమోలులో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లో స్థానికులు కాలనీగా ఏర్పాటు చేసుకోని నివాసం ఉంటున్నారు. అలా ఆ ప్రాంతంలో సుమారు 300 కుటుంబాల పైన నివాసముంటున్నాయి. అయితే, గత కొంత కాలంగా అక్కడి ప్రజల కనీస మౌళిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో తమకు మూడు సెంట్లు స్థలాన్ని ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం... తమకు వచ్చిన స్థలంలో ఇళ్లు కట్టిస్తామన్నారని.. అయితే, తమ వద్ద మూడు సెంట్ల భూమిని సేకరించి చివరకు సెంటున్నర స్థలమే ఇచ్చారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో దోమలు, పాములతో సహజీవనం చేయవలసి వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కాలనీలోకి అంబు అంబులెన్స్(Ambulance) రావాలన్న ఇబ్బందులు ఏదుర్కొవాల్సి వస్తోంది కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tidco Houses Lacked Security: టిడ్కో ఇళ్లలో భద్రత కరవు.. మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన విద్యుత్ తీగలు
No Basic Facilities Jagananna Colony: అధికారులతో పాటుగా.. గ్రామ సర్పంచ్, స్థానిక ఎమ్మెల్యేకు తమ సమస్యలు తెలియజేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 30 ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీ అప్పుడు ఎలా ఉందో, ఇప్పటికీ అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో సుమారు 3 వందల కుటుంబాల నివాసం ఉంటున్నా... కనీస మౌళిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తమ కాలనీ సమస్యలు పరిష్కారించాలని గత కొంత కాలంగా ప్రజాప్రతినిథుల చుట్టూ తిరుగుతున్నామని పేర్కొన్నారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు. తనను నమ్మి గెలిపించిన స్థానిక వైసీపీ వార్డు మెంబర్ ఉషశ్రీ ఇటీవల రాజీనామా చేశారు. ప్రజల కష్టాలు పరిష్కరించలేకపోవడంతోనే రాజీనామ చేసినట్లు తెలిపారు. కాలనీ వాసులకు కనీసం రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థలు(Drainage system) ఏర్పాటు చేయాలని.. ఎంత ప్రయత్నించినా సఫలం కాలేక పోవడంతో రాజీనామా చేసినట్లు ఉషశ్రీ తెలియజేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమానికి వచ్చిన సమయంలో తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తానని చెప్పినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోతున్నారు.
No Basic Facilities Jagananna Colony: కాలనీల్లో రహదారులు, వీధి లైట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీరు వచ్చి చేరుతుందని వాపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నో సార్లు చెప్పిన.. సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఇచ్చిన మూడు సెంట్ల స్థలాన్ని... వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇళ్లు కట్టిస్తామన్నామని చెప్పి సెంటున్నర స్థలాన్ని ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. ఇళ్లు కట్టకపోతే స్థలాలు వెనక్కి తీసుకుంటామని బెదిరించడంతో అప్పులు చేసి మరి కట్టామని ప్రజలు వాపోయారు. జగనన్న కాలనీలో ఇళ్లు (Jagananna Colony)కట్టినా... రహదారులు, నీటి సదుపాయం, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Public fire on MLA: మాకు ఇళ్లు, స్థలాలు ఏవీ..? ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు