తమ గ్రామంలో డంపింగ్ యార్డు వద్దంటూ కృష్ణాజిల్లా గన్నవరం మండలం సవారీవారిగూడెం గ్రామస్థులు వినూత్న నిరసన చేపట్టారు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దంటూ బ్యాలెట్ రూపొందించి పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ యార్డు ఏర్పాటు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ.. అనేక రోగాలు చుట్టుముడతాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న గ్రావెల్ క్వారీతో శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నామన్నారు. అధికారులు స్పందించి డంపింగ్ యార్డు నెలకొల్పాలన్న ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి..